ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా సీనియర్ పొలిటిషన్ బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) పేరును ఖరారు చేయగా, ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు.వైసీపీకి ఇక్కడ గెలుపునకు అవసరమైన స్థానిక సంస్థల ఓటర్ల మెజారిటీ ఎక్కువగా ఉండడంతో , గెలుపు పై ఆ పార్టీ ధీమా తో ఉండగా, ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి దించే విషయంలో టిడిపి ఇంకా తర్జనభజన పడుతోంది.
అసలు ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా లేదా అనే విషయంలో ఇంకా ఏ క్లారిటీ లేదు .ఈ రోజు టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )దీనిపై నిర్ణయం తీసుకోనున్నార.నామినేషన్ల దాఖలకు గడువు నేటితో ముగుస్తోంది .ఒకవేళ టిడిపి( TDP ) పోటీ చేయాలని నిర్ణయిస్తే, ఆ పార్టీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తిని పోటీకి దింపే ఆలోచనలో ఉన్నారు .
ఆయన సైతం పోటీకి సిద్ధంగానే ఉన్నారు.వాస్తవంగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి , పీలా గోవింద్ ( MLA Gandi Babji, Peela Govind )వంటి వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి .తాజాగా దిలీప్ చక్రవర్తి ( Dilip Chakraborty )పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది .పోటీ అంటూ చేస్తే దిలీప్ చక్రవర్తినే అభ్యర్థిగా ప్రకటించాలని చంద్రబాబు సైతం నిర్ణయించుకున్నారట .ఇప్పటికే విశాఖ జిల్లా నేతలు దిలీప్ చక్రవర్తి పేరుని చంద్రబాబుకు నివేదిక రూపంలో పంపించడంతో ఆయనే టిడిపి అభ్యర్థి కానున్నారు.ఇటీవల ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి టిడిపి నుంచి అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశించారు .కానీ పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించడంతో దిలీప్ చక్రవర్తికి అవకాశం దక్కలేదు.
ఇక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టిడిపి కూటమికి పెద్దగా బలం లేకపోవడంతో, చంద్రబాబు సైతం అభ్యర్థిని పోటీకి దింపే విషయంలో ఆసక్తి చూపించడం లేదు.కచ్చితంగా గెలుస్తాము అనుకుంటే అభ్యర్థిని ప్రకటిస్తామని, లేదంటే సైలెంట్ గా ఉండడమే మంచిది అని ఇప్పటికే విశాఖ జిల్లా నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు తీసుకునే నిర్ణయం పైనే ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా లేదా అనేది క్లారిటీ రానుంది.