ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ దూరం... కారణం చెప్పిన చంద్రబాబు 

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం ,బిజెపి, జనసేన ( Telugu Desam, BJP, Jana Sena )కూటమి దూరంగా ఉండబోతుంది.ఇప్పటికే ఇక్కడ వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ను వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

 Chandrababu Said Distance From Tdp Was The Reason For Mlc Election, Tdp, Chandra-TeluguStop.com

నిన్ననే బొత్స సత్యనారాయణ నామినేషన్ కూడా దాఖలు చేశారు.నేడు నామినేషన్ దాఖలకు చివరి తేదీ కావడంతో,  టిడిపి నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగింది.

అయితే తాజాగా ఇక్కడ టిడిపి కూటమి అభ్యర్థిని పోటీకి దించే విషయంలో టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల్లో టిడిపి కూటమికి తగినంత బలం లేకపోవడంతో,  ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలియజేశారు.

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Visakha Mlc-Polit

 గెలవాలంటే పెద్ద కష్టమేమీ కాదని , కానీ హుందాగా రాజకీయాలు చేద్దామని టెలికాన్ఫరెన్స్( teleconference ) లో చంద్రబాబు నేతలకు సూచించారు.చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు అంతా ఆమోదించారు.గెలుపు కాదు ప్రజల అభిప్రాయాలు , విలువలు ముఖ్యమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు .ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం,  అన్ని వర్గాల అభివృద్ధి అని చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని టిడిపి నిర్ణయించింది.

కూటమి పక్షాలు బలం పరిమితంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Visakha Mlc-Polit

 జీవీఎంసి కార్పొరేటర్లు,  నర్సీపట్నం,  ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు( Elamanchili Municipal Councillors ),  జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉన్నారు .వీరిలో 60 శాతానికి పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే కావడంతో,  ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు కష్టమనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం వైసిపి స్థానిక సంస్థల ఓటర్లను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు .ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో టిడిపి పోటీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడంతో వైసిపి అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube