బీహార్ లోని గోపాల్గంజ్( Gopalganj in Bihar ) లో ఓ వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది.ఇక్కడ అత్త, తన మేనకోడలిని పిచ్చిగా ప్రేమించి.
తన భర్తను, తన ఇంటిని విడిచిపెట్టి మేనకోడలిని వివాహం చేసుకుంది.అత్త, మేనకోడలు ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
వీరిద్దరి మధ్య గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.
ఇకపోతే ఈ మొత్తం వ్యవహారం కుచయ్ కోట్ పోలీస్ స్టేషన్ ( Kuchai Kot Police Station )పరిధిలోని బెల్వా గ్రామంలో చోటు చేసుకుంది.అత్త, మేనకోడలు మధ్య ప్రేమ చిగురించి ఇంటి నుంచి పారిపోయి ససముసాలోని దుర్గ గుడికి వెళ్లారు.అయితే తాజాగా సోమవారం వీరిద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకున్నారు.ఈ వివాహంలో అత్త వరుడిగా, మేనకోడలు వధువుగా మారింది.ఇద్దరూ గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు జన్మల వరకు ఒకరికొకరు అయ్యారు.గుడిలో హిందూ సాంప్రదాయం( Hindu tradition in the temple ) ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు.
ఆలయంలో అత్త కోడలి మెడలో మంగళసూత్రాన్ని కట్టి మేనకోడలిని వివాహం చేసుకుంది.
ఇక ఈ విషయం సంబంధించి.అత్త మాట్లాడుతూ.‘‘మేనకోడలు అంటే తనకి చాలా ప్రాణం.
ఒకవేళ తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తనని కోల్పోవాల్సి వస్తుందని ఊహించలేకపోయానని., ఒకరినొకరు కోల్పోతామనే భయం వల్ల ఎవరు ఏమనుకుంటారో అనుకోకుండా.
అన్నీ వదిలేసి పెళ్లి చేసుకున్నామని అత్త పేర్కొంది.గత మూడేళ్లుగా తాము కలిసి ఉన్నామని.
ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కావడానికి నిర్ణయం తీసుకన్నామని ఆమె తెలిపింది.ఇక తన మేనకోడలు కూడా మాట్లాడుతూ.
మేము కలిసి ఉన్నంత కాలం.లోకం ఏం మాట్లాడినా మాకు అవసరం లేదని.
, ఎవరెమ్మన పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.