ఎవరికీ ఇబ్బంది లేకుండా గణేష్ ఉత్సవాలకు పర్మిషన్లు ఇవ్వండి

నల్లగొండ జిల్లా:రాబోయే వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా ఆయా ఉత్సవ కమిటీలు మెయిన్ రోడ్లకు,సిసి రోడ్లకు అడ్డంగా,సిసి రోడ్లు మొత్తం ధ్వంసం చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వెళ్లడానికి వీలు లేకుండా మండపాలు నిర్వహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డా.టీజీ.

 Give Permissions To Ganesh Celebrations Without Bothering Anyone , Ganesh Celebr-TeluguStop.com

లింగం,బొడిగే అంజయ్య, ఆదిలక్ష్మి,రాజశేఖర్, రాజ్యలక్ష్మి విజ్ఞప్తి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిని కలిసి రోడ్లను బ్లాక్ చేయకుండా, సిసి రోడ్లు ధ్వంసం చేయకుండా ఓపెన్ ప్లాట్ లేదా ఖాళీ ప్రదేశాలలో మండపాలు ఏర్పాటు చేసేలా ఉత్సవ కమిటీలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే వినాయక చవితి కోసం సేకరించిన చందాలను మద్యం ఇతర డీజే వాద్యాలకు ఖర్చు పెట్టకుండా నిమజ్జనం రోజు భక్తితో కూడిన భజన కార్యక్రమాలు చేపట్టాలని, మిగిలిన డబ్బులతో పేద విద్యార్థులకు విద్యావసరాలకు, పుస్తకాలు,పేరెంట్స్ లేని పిల్లలకి స్కూల్ ఫీజు లాంటివి చెల్లించాలని, లేదా వారి చుట్టుపక్కల ఉండే పేదలకు తినటానికి నిత్యావసర సరుకులు, లేదా మెడిసిన్ అందజేసేలా సూచించాలని కోరారు.

ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్సవ కమిటీల వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నేస్తం సంస్థ నుండి ఉత్సవ కమిటీకి సేవా పురస్కారం,సేవా నేస్తం అవార్డు ప్రధానం చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube