కొవ్వును కరిగించే కూరగాయలు ఇవి.. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అస్సలు మిస్ అవ్వకండి!

అధిక బరువు సమస్యతో బాగా నలిగిపోతున్నారా.? వెయిట్ లాస్ అవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే కూరగాయలు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.కొవ్వును కరిగించి బ‌రువును త‌గ్గించ‌డానికి ఈ కూరగాయలు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

 Best Fat Cutter Vegetables For Losing Weight! Fat Cutter Vegetables, Weight Loss-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందాం పదండి.

క్యాప్సికం( Capsicum ).ధ‌ర కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గా పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి.క్యాప్సికంకు కొవ్వును కరిగించే గుణం ఉంది.

వారంలో రెండు సార్లు క్యాప్సికం ను తింటే పొట్ట కొవ్వు దెబ్బకు కరిగిపోతుంది.అలాగే మెటబాలిజం రేటు పెరుగుతుంది.

దాంతో వెయిట్ లాస్ అవుతారు.

Telugu Capsicum, Cucumber, Fatcutter, Lady Finger, Latest, Tips-Telugu Health

అలాగే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా తమ డైట్ లో బెండకాయ( Okra )ను చేర్చుకోండి.బెండకాయ వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుంది.అదే స‌మ‌యంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

మరియు గుండె ఆరోగ్యాన్ని సైతం పెంచుతుంది.

Telugu Capsicum, Cucumber, Fatcutter, Lady Finger, Latest, Tips-Telugu Health

వెయిట్ లాస్ కు సహాయపడే కూరగాయల్లో కీర దోసకాయ ఒకటి.రోజుకు ఒక కీర దోసకాయను తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కీరా దోసకాయలో ఫైబ‌ర్ తో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల కీరా దోస‌కాయ‌ను తీసుకుంటే ఎక్కువ స‌మ‌యం పాటు పొట్ట నిండిన భావ‌న‌ కలుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.క్యాలరీలు త్వరగా కరుగుతాయి.

దాంతో వేగంగా వెయిట్ లాస్ అవుతారు.ఇక పాలకూర( Spinach ) కూరగాయ కాకపోయినా ఆకుకూరల్లో అద్భుతమైనది.

వెయిట్ లాస్ కు పాలకూర చాలా బాగా సహాయపడుతుంది.పాలకూరను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే త్వరగా బరువు తగ్గడమే కాదు రక్తహీనత సమస్య ఉంటే దూరం అవుతుంది.

కంటి చూపు సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube