తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు ( Kota Srinivas Rao ) గారు ఉండేవారు.ఈయన ఎన్నో క్రూరమైన విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అలాగే కొన్ని కామెడీ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా నటుడుగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నా కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయసు పై పడటంతో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటిపట్టునే ఉన్నారు.ఇలా ఇంటిపట్టునే ఉన్న ఈయన ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇలా ఈయన సినిమా సెలబ్రిటీల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా కొంతమంది సెలబ్రిటీలు ఈయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఈయన మాత్రం తన ధోరణిని మార్చుకోలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన బాహుబలి ( Bahubali ) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.రాజమౌళి( Rajamouli ) ప్రభాస్ ( Prabhas ) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే .ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ స్థాయిలో కూడా మారుమోగిపోయాయి.
అయితే బాహుబలి సినిమా గురించి ఈయన మాట్లాడుతూ.ఈ సినిమాకు ఎన్నో అవార్డులు పురస్కారాలు వచ్చే కానీ ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవడం లేదని తెలిపారు.కానీ కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన పాతాళ భైరవి సినిమా గురించి ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో స్పష్టంగా అర్థమవుతుంది.అలాంటి స్థాయి సినిమాలు నేటితరం డైరెక్టర్లు తీయలేరని ఈయన తెలిపారు.
ఇలా బాహుబలి సినిమాను తక్కువ చేసి మాట్లాడుతూ పాతాళ భైరవే ( Pathala Bhairavi ) గొప్ప సినిమా అని చెప్పడంతో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.పాతాళ భైరవి సినిమా గొప్ప సినిమా కావచ్చు కానీ బాహుబలి సినిమాని తక్కువ చేసి మాట్లాడటం సరైనది కాదని ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఇండియన్ సినిమాకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిందని నేటిజన్స్ ఈయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.