చాలా చోట్ల పంటలకు నీళ్ల కోసం బోరుబావులను వేయడం మనం చూస్తూనే ఉంటాము.అయితే దృవదృష్టశాత్తు ఎవరైనా బోర్లు వేయించినప్పుడు అందులో నీరు రాకపోతే వాటిని అలాగే వదిలేయడం గమనిస్తూనే ఉంటాము.
ఇలా వదిలేసిన బోరు బావిలలో కొందరు చిన్నారులు ఆడుకుంటూ పొరపాటున అందులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే చూసాము.ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి బోరుబావి ( Borehole )లోపల ఎలా ఉంటుందన్న సంగతి సంబంధించి ఓ వీడియో చిత్రీకరించాడు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
భూమి లోపల ఏముందన్న విషయాన్ని తెలుసుకోవడానికి కోసం ఓ వ్యక్తి గోప్రా కెమెరాను( Gopra camera ) వెయ్యి అడుగుల లోతైన బూర బావిలోకి పంపించాడు.ఈ బోర్ వెల్ లో ఐరన్ కేసింగ్ పైపు లో ఓ పెద్దమనిషి తల పట్టేంత వెడల్పుగా ఉండడం అతడు చూపిస్తాడు.ఆ తర్వాత ఓ కెమెరాను తాడు సహాయంతో ఆ కేసింగ్ పంపు నుండి లోపలికి పంపిస్తాడు.
అయితే లోపలి కెమెరాను దించే సమయంలో అతడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.ముందుగా కెమెరాను ఓ ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచి భూమి లోపల చీకటిగా ఉంటుందన్న నేపద్యంలో ఒక టార్చ్ లైట్‌ను కూడా అందుకు అమర్చాడు.
ఆ రెండింటిని ఒక కవర్లో పెట్టి దారం సహాయంతో గట్టిగా దానిని కట్టి తాడును నెమ్మదిగా కేసింగ్ లోకి దించుతూ.బోరు బావి లోపల ఏముందో చిత్రీకరించాడు.
ఈ సమయంలో బోరుబావిలో లోపలికి వెళ్లే కొద్దీ భూమిలోని నీరు రాళ్లు ఎలా ఉన్నాయో అని కెమెరా రికార్డు చేసింది.
అయితే ఆ సమయంలో 200 అడుగుల ( 200 feet )వరకు కెమెరాను లోపల పంపించి అక్కడ ఆ వ్యక్తికి అర్థమవుతుంది.ముఖ్యంగా అక్కడ నీరు కనపడడంతో ఇంకా ఎనిమిది వందల అడుగుల లోతు కెమెరాను తీసుకెళ్లడం కష్టంగా మారడంతో పొరపాటున కెమెరా పాడైపోతుందన్న భయంతో అతడు దాన్ని పైకి లాగేసాడు.ఇక కెమెరాను కిందకి పంపించేటప్పుడు గడ్డి, రాళ్లు, పైపులు ఇలా ఎన్నో కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఆ ఐరన్ కేసింగ్ కూడా కొద్దిసేపు ఉండడం., ఆ తర్వాత రాతిపోర అందులో కనబడింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే లేకపోతే ఏదైనా జంతువులు లేదా చిన్నపిల్లలు ప్రమాదం అంచున పడవచ్చ అంటూ కామెంట్ చేస్తున్నారు.