టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నటులలో సంజయ్ దత్( Sanjay Dutt ) ఒకరు.తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఈ నటుడికి సౌత్ భాషల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.సంజయ్ దత్ నటిస్తే సినిమా హిట్ అనే సరికొత్త సెంటిమెంట్ సైతం ప్రస్తుతం తెరపైకి వస్తోంది.కేజీఎఫ్2, లియో సినిమాలలో సంజయ్ దత్ నటించి తన నటనతో ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించారు.
అయితే బాలీవుడ్ సినిమాల( Bollywood Movies ) గురించి సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ నటుడు అయిన సంజయ్ దత్ ఊహించని విధంగా కామెంట్స్ చేసి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.
బాలీవుడ్ సినిమాలలో హీరోయిజం పోయిందని ఆయన పేర్కొన్నారు.సౌత్ సినిమాలలో( South Movies ) మాత్రం అది కనిపిస్తోందని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.హీరోయిజం, మాస్ అప్పీల్ అనేవి భారతీయ సినిమా మూలాలు అని ఆయన పేర్కొన్నారు.
సినిమా ప్రేక్షకులు ముంబై, హైదరాబాద్ నుంచి మాత్రమే రారని వేర్వేరు రాష్ట్రాల నుంచి సినీ అభిమానులు సినిమాలను చూస్తారని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.వాళ్లకు హీరోయిజం కావాలని థియేటర్లలో ఈలలు వేయాలని వాళ్లు అనుకుంటారని సంజయ్ దత్ పేర్కొన్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీ ఆ ఆడియన్స్ ను కోల్పోయిందని ప్రస్తుత పరిస్థితికి ఇదే కారణమని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.
డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించగా ఈ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.డబుల్ ఇస్మార్ట్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డబుల్ ఇస్మార్ట్ సినిమా బుకింగ్స్ ఇంకా చాలా ఏరియాలలో మొదలుకావాల్సి ఉంది.సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.