యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మంచాల శ్రీనివాసులు ప్రస్తుతం హైదారాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఎంపికయ్యారు.ఇటీవల సికింద్రాబాద్ లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30 రోజుల ప్రాక్టీసులో ఆయన పాల్గొన్నారు.
ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంపా నాగేశ్వరరావు,
ప్రముఖ సినీనటుడు కేవీ ప్రదీప్ చేతుల మీదుగా వ్యక్తిత్వ శిక్షకుడిగా సర్టిఫికేట్ అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో యువతకి బాల్యం నుండి సరైన అవగాహన లేక పెడదారిన పడుతున్నారన్నారు.
వారికి బాల్యంలో మానవ విలువలు,సమాజం,ఉన్నత చదువులపై సరైన అవగాహన కల్పిస్తే వారి భవిష్యత్ బాగుంటదని అన్నారు.జల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ఉచిత శిక్షణ ఇస్తానని తెలిపారు.