రాజన్న సిరిసిల్ల జిల్లా: టిడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ కు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించలని వినతిపత్రం సమర్పించారు.అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని గత సంవత్సరం లో వినతిపత్రం ఇచ్చామని ఇంత వరకు స్థలాలు కేటాయించలేదని ఇప్పటికయినా ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.
దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వేములవాడ ఆర్డీవోకు ఇట్టి అంశంపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం పట్టణ అధ్యక్షులు కొప్పుల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారం కొరకై కృషి చేసే జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది.
నిరుపేదలైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా అధ్యక్షుడు పెరుకా రవి, వేములవాడ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, జవ్వాజి అంజయ్య, కవ్వాలా సురేందర్, అవధూత శ్రీధర్, నరేందర్, భిక్షపతి, చంద్రశేఖర్ భిక్షపతి, చింతల శ్రీనివాస్, వెంకటమల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.