నాగ్ అశ్విన్.( Nag Ashwin ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకు( Kalki ) దర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కల్కి సినిమాతో భారీగా క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేశారు నాగ్ అశ్విన్. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
ప్రతి ఒక్కరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంతకీ ఆయన ఏం చేశారు అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని వస్తే.తాజాగా నాగ్ అశ్విన్ భారీ సహాయాన్ని చేశారు.నాగర్ కర్నూల్( Nagarkurnool ) జిల్లాలోని తన సొంతూరు ఐతోల్లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు( Government School ) అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు.
తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్ కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు చెప్పుకొచ్చారు.అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ.66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది.భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ తెలిపారు.
తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు.
కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా మొదట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ ఆ తర్వాత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకున్నారు.ఇక ఇటీవల కల్కి సినిమాతో మరో అరుదైన గౌరవాన్ని విజయాన్ని దక్కించుకున్నారు.