తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్( Vikram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విక్రమ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.అందులో భాగంగానే విక్రమ్ తాజాగా నటించిన చిత్రం తంగలాన్.
( Thangalaan ) ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్.
అందులో భాగంగానే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో విక్రమ్ కు ఇబ్బంది పెట్టే ప్రశ్న ఎదురయింది.కానీ ఆ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పి అందర్నీ మెప్పించారు.కోలీవుడ్‌లో సూర్య,( Surya ) అజిత్,( Ajith ) విజయ్( Vijay ) వంటి స్టార్స్‌కు ఉన్నంత రేంజ్‌లో మీకు అభిమానులు ఉన్నారా? అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా.అందుకు విక్రమ్ ఇలా రియాక్ట్ అవుతూ.నా అభిమానుల గురించి మీకు ఏమీ తెలియదు అనుకుంటున్నాను.సినీ అభిమానులంతా నా అభిమానులే.అందుకు రుజువు కావాలంటే ఆగష్టు 15న థియేటర్‌కి రండి.సినిమా చూసి నా అభిమానుల బలం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చుడండి.
అప్పుడు మీకే తెలుస్తుంది.టాప్ 3, టాప్ 4, టాప్ 5 అంటూ నాకు కొలమానం లేదు.ఏది ఏమైనా ఆ రోజు మీరు థియేటర్‌కి వస్తారని ఆశిస్తున్నాను.నా అసిస్టెంట్‌కి మీ నంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు.ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాము.మీరు థియేటర్‌కు వచ్చి నా అభిమానులను చూస్తే, ఏదోరోజు ఆ స్టార్స్ ను కూడా ఇదే ప్రశ్న అడుగుతారు.
నా అభిమానుల గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టే ఇలాంటి ప్రశ్న అడిగారు.నాకు టాప్ హీరో లిస్ట్‌లో ఉండటం ముఖ్యం కాదు.
ప్రేక్షకులే ముఖ్యం.ధూల్, సామి లాంటి సినిమాలు ఎలా తీయాలో నాకు తెలుసు, తంగలాన్ కోసం నా బెస్ట్ ఇచ్చాను.
నా విషయానికొస్తే అందరూ ఏదో ఒక విధంగా నా అభిమానులే అంటూ జర్నలిస్ట్ కు దిమ్మ తిరిగే విధంగా చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.