గేమ్ ఛేంజర్ మూవీకి మరో టెన్షన్.. షారుఖ్ తో పోటీ పడితే అక్కడ కష్టమేనా?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్( Shahrukh Khan ) గత ఏడాది జవాన్ పఠాన్ వంటి సినిమాలతో రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ రెండు సినిమాలు గత ఏడాది విడుదల అయ్యి దాదాపుగా 2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన విషయం తెలిసిందే.

 Ram Charan Game Changer And Mufasa Release Same Time Details, Ram Charan, Shahru-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాలు అన్ని భాషల్లోనూ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి మరిచిపోలేని కలెక్షన్స్ ని పిచ్చి పెట్టాయి.

అదేవిధంగా షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా విడుదల అయ్యి పరవాలేదు అనిపించుకుంది.డార్లింగ్ ప్రభాస్ సలార్ కి పోటీగా డంకీ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.

అయితే ఈ పోటీలో ప్రభాస్ సలార్ తో విన్నర్ గా నిలిచాడు.సలార్( Salaar ) వేవ్ ముందు డంకీ నిలబడలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ నుంచి ఒక్క ఫైటర్ మూవీ తప్ప చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు రాలేదు.అక్షయ్ కుమార్ నుంచి బడే మియాన్ చోటే మియాన్ మూవీ రిలీజ్ అయిన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

టాలీవుడ్ నుంచి మాత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో చాలా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 1150 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది.

నెక్స్ట్ సెప్టెంబర్ 27న దేవర( Devara ) మూవీ పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రానుంది.

Telugu Abram Khan, Aryan Khan, Bollywood, Chava, Devara, Game Changer, Mufasa, P

అయితే డిసెంబర్ నెలలో టాలీవుడ్ నుంచి ఎక్కువ సినిమాలు సందడి చెయ్యబోతున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది.ఈ సినిమాకి పోటీగా విక్కీ కౌశల్ చావా మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.

అయితే పుష్ప ది రూల్ పై నార్త్ లో భారీ హైప్ నెలకొని ఉంది.ఇది చావాకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గేమ్ చేంజర్( Game Changer ) క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.ఈ సారి షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ తో పోటీ పడబోతున్నారట.2019లో వచ్చిన మఫాసా ది లయన్ కింగ్ కి( Mufasa The Lion King ) ప్రీక్వెల్ గా ఇది రెడీ అవుతోందట.ఇందులో షారుఖ్ ఖాన్ కొడుకులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ సింబ, జూనియర్ మఫాసా పాత్రలకి వాయిస్ అందించారంట.

Telugu Abram Khan, Aryan Khan, Bollywood, Chava, Devara, Game Changer, Mufasa, P

మఫాసా యానిమేషన్ మూవీకి ఇండియాలో మంచి ఆదరణ ఉంది.గేమ్ ఛేంజర్ పైనే ఇప్పటికే పెద్దగా బజ్ లేదు.దర్శకుడు శంకర్ మీద ఇప్పటికే ఇండియన్ 2 ఎఫెక్ట్ వలన ఫ్యాన్స్ లో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.ఇక బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువైతే కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉంది.

టాక్ సాలీడ్ గా ఉంటేనే సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతాయి.మొత్తంగా చూసుకుంటే బాలీవుడ్లో గేమ్ చేంజర్ సినిమాకు షారుక్ ఖాన్ సినిమా రూపంలో మరో టెన్షన్ మొదలయ్యింది.

మరి వీటన్నింటిని దాటుకొని ధైర్యంగా విడుదల చేస్తారా లేదంటే సినిమా విడుదల తేదీన వాయిదా వేస్తారేమో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube