మహానటి సావిత్రి( Mahanati Savitri ) 1952లో తమిళ హీరో జెమినీ గణేశన్ ను( Gemini Ganesan ) పెళ్లి చేసుకుంది.గణేశన్‌కు అప్పటికే వివాహమై, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
దీని వల్ల సావిత్రి బాగా డిసప్పాయింట్ కావడం, తర్వాత తనకు తానే హాని చేసుకోవడం జరిగింది.గణేశన్‌ను పెళ్లి చేసుకున్న తొలి రోజుల్లో సావిత్రి చాలా ఆనందంగానే గడిపింది.
ఆమె లైఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగింది.ఈ దంపతులు పెళ్లయిన తొలి రోజుల్లో చెన్నై నగరం, అభిరామపురం అనే ఒక చిన్న గ్రామంలో ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశారు.
అప్పట్లో సావిత్రి చాలా బిజీగా ఉండేది.అందువల్ల వంట పనులు, ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని హైర్ చేసుకుంది.
ఆ పనిమనిషి( Maid ) మామూలు మహిళ కాదు.ఆమె ఒకప్పుడు చాలా గొప్పగా బతికింది.కానీ విధి చిన్నచూపు చూడడంతో ఆస్తులన్నీ పోయాయి.చివరికి సావిత్రి ఇంట్లో పనిమనిషిగా కుదిరింది.
అయితే సావిత్రి కి ఆమె చరిత్ర మాత్రం ఒక రోజు తెలిసింది.దాంతో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని సావిత్రి అనుకుంది.
అందుకే ఒకరోజు ఆమెను పిలిచి “చూడమ్మా, మేమిద్దరం ఎప్పుడూ స్టూడియోల్లోనే ఉంటాం.ఇంకా మాకు పిల్లా పీచు ఎవరూ లేరు.మీరు ఇంట్లో చాలా దర్జాగా బతకవచ్చు.” అని ఆమెతో అన్నారట.
సావిత్రమ్మ ఆ మాటలు అంటుంటే సదరు పని మనిషి ఎమోషనల్ అయిందట.అంతేకాదు “అయ్యో అమ్మగారు, మీరు నాకు ఇబ్బంది అవుతుందని పిల్లలను కనకుండా ఉండాల్సిన అవసరం లేదు.మొహమాటం లేకుండా మీరు పిల్లల్ని కనండి.నేనే జాగ్రత్తగా చూసుకుంటాను.” అని హామీ ఇచ్చిందట.దాంతో సావిత్రి చిరునవ్వు నవ్వి పిల్లల్ని కన్నది.
సినిమా షూటింగ్స్ అంటూ ఇద్దరూ కూడా చాలా బిజీగా ఉండేవారు కాబట్టి పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు అని భయపడేవారు.
ఈ పనిమనిషి పిల్లల్ని చూసుకుంటుందని నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.మాట ఇచ్చినట్లుగానే ఆ పిల్లలను కళ్ళలో పెట్టుకుని చూసుకుంది.సావిత్రికి విజయ చాముండేశ్వరి( Vijaya Chamundeswari ) అనే కూతురు, సతీష్ కుమార్( Sathish Kumar ) అనే కొడుకు ఉన్నారు.
ఆ పనిమనిషి ఎవరు, ఎందుకు ఆస్తులను కోల్పోయింది అనే వివరాలు మాత్రం తెలియ రాలేదు.తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సావిత్రి చూసుకుని తన మంచి మనసును చాటుకుంది.