సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే తెలుగులో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటూ సినిమా ఇండస్ట్రీ కూడా రోజురోజుకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు( Manchu Vishnu ) మాత్రం తనదైన రీతిలో సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన ఎంటైర్ కెరియర్ లో దేనికైనా రెడీ లాంటి రెండు సినిమాలు తప్ప మిగతావి ఏవి కూడా అంత బాగా ఆడలేదు.
మరి దానికి కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం విష్ణు తనదైన రీతిలో మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగానే ఆయన చేస్తున్న కన్నప్ప సినిమా( Kannappa Movie ) మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్,( Akshay Kumar ) మోహన్ లాల్,( Mohan Lal ) ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరోలు కూడా నటించడం ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక దానికోసమే 150 కోట్ల వరకు బడ్జెట్ ను కూడా కేటాయించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో స్టార్ హీరోల సహాయం తో విష్ణు ఒక మంచి సక్సెస్ ని సాధిస్తాడు అని అందరు చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు… చూడాలి మరి ఈ సినిమాతో విష్ణు జాతకం మారుతుందా లేదా అనేది…
.