తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగుందిన వాళ్లు సైతం ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు.నిజానికి జగపతిబాబు( Jagapathi Babu ) శ్రీకాంత్( Srikanth ) లాంటి నటులు ఒకప్పుడు స్టార్లుగా వెలుగొందటమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమా థియేటర్ కి రప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
ఇక వీళ్లిద్దరూ ఆ తర్వాత కాలంలో కథల సెలక్షన్ లో చాలావరకు లోపాలు ఉండటంవల్ల వీళ్ళు ఎంచుకున్న కథలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ మార్కెట్ అనేది భారీగా డౌన్ అయిపోయింది.
అందువల్ల ఇప్పుడు వాళ్ళు విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పలు రకాల క్యారెక్టర్ లను పోషిస్తూ సపోర్టింగ్ రోల్స్ లో( Supporting Roles ) సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) నుంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందుతున్నారు.మరి మొత్తానికైతే వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కి రప్పించడంలో చాలా సక్సెస్ అయ్యాయి.
అలాగే ఇప్పుడు కూడా వీళ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే దక్కుతుంది.ఇక వీళ్ళు చేసిన ప్రతి పాత్రలో వాళ్లని వాళ్లు రిప్రజెంట్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ ని కూడా సస్టైయిన్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు.చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో వీళ్ళు ఎలాంటి మంచి పేర్లు సంపాదించుకుంటారు అలాగే వీళ్ళ ద్వారా సినిమాలకి పేరు రావడమే కాకుండా వీళ్ళకి కూడా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసినందుకు మంచి అవార్డులు అందుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే తెలుగు లోనే కాకుండా పలు భాషల్లో కూడా వీళ్ళు నటిస్తూ నటులుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు…
.