తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్నప్పటికీ తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలకి కూడా తెలుగులో మంచి మార్కెట్ అయితే ఉంది.ఇక ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన విక్రమ్ తంగలాన్ సినిమాతో( Thangalaan ) ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్న విక్రమ్ ( Vikram ) ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయనకు భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక 2005 వ సంవత్సరంలో అపరిచితుడు సినిమా( Aparichitudu ) తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు.ఇక దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ఇప్పుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి ఆయన కనక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే పాన్ ఇండియాలో మరోసారి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటాడు.ఇక లేకపోతే మాత్రం మరోసారి ఆయన మార్కెట్ అనేది భారీగా డౌన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక పా.రంజిత్( Pa Ranjith ) డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమాతో అటు పా రంజిత్ కి ఇటు విక్రమ్ కి మంచి సక్సెస్ దక్కితే మాత్రం వీళ్ళిద్దరికీ తెలుగుతో పాటు పాన్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక ఇప్పటికే పా.రంజిత్ చేసిన కబాలి, కాళి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఇక తెలుగులో కూడా ఈ రెండు సినిమాలు ప్లాప్ అవడంతో ఆయనకు మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవ్వలేదు.మరి ఇప్పటికైన ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం తంగలాన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి.
లేకపోతే మాత్రం తనకి తెలుగులో ఇక మార్కెట్ లేనట్టే…
.