ఇప్పుడు తెలుగు సినిమా( Telugu Cinema ) పేరు చెబితే చాలు ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ అంటూ ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.మరి తెలుగులో వచ్చిన ప్రతి సినిమా కోసం బాలీవుడ్ లోని( Bollywood ) ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.
అంటే తెలుగు సినిమా ఎంతటి స్థాయిని సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇంకా ఇప్పటికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను భారీ రేంజ్ లో పెంచుతూ దర్శకులు భారీ సినిమాలను చేసి ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ లో అసలు ఒక్క సక్సెస్ కూడా రాకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక తెలుగులో ఎలాంటి కథలైతే వస్తున్నాయో అలాంటి కథలతోనే బాలీవుడ్ లో సినిమాలు చేయాలని బాలీవుడ్ దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ విషయంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు తెలుగు వాళ్ళను ఫాలో అవుతున్నారు.అప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ( Tollywood ) చులకనగా చూసిన బాలీవుడ్ ఇప్పుడు మాత్రం మన ఇండస్ట్రీని ఫాలో అవ్వడం అనేది ఒక రకంగా మనం సాధించిన విజయమనే చెప్పాలి…
ఇక ఇప్పటికే బాలీవుడ్ లో భారీ సక్సెస్ ని అందుకున్న మన హీరోలు ఇక ముందు రాబోయే సినిమాలతో కూడా అంతకుమించి అనేలా భారీ సక్సెస్ లను అందుకునే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.ఇక ఎన్టీఆర్,( NTR ) రామ్ చరణ్,( Ram Charan ) అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరోలు సైతం వాళ్ల సినిమాలతో సూపర్ సక్సెస్ లను కొట్టడానికి రెడీ అవుతున్నారు…చూడాలి మరి బాలీవుడ్ మన సినిమాల హవా ఏ రేంజ్ కి వెళ్తుందో….