ఎన్నికల ప్రచారంలో ఉండగా.రిపబ్లికన్ నేత , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) హత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్, పోలీస్ శాఖల పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.మొన్నామధ్య తను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వెనుక సైబర్ దాడి జరిగి ఉంటుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో ట్రంప్‌కు భద్రతను పెంచారు అధికారులు.ఈ క్రమంలో ఆదివారం ఆష్‌బర్న్‌లోని( Ashburn ) డొనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యాలయంలో చోరీ జరగడం అంతే కలకలం రేపుతోంది.
ఆఫీస్‌లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.
వాషింగ్టన్ డీసీ డౌన్‌టౌన్‌కు పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న సబర్బన్‌లో ఈ ఘటన జరిగింది.ఈ కార్యాలయం వర్జీనియా( Virginia ) 10వ జిల్లా రిపబ్లికన్ కమిటీకి హెడ్ క్వార్టర్స్‌గానూ పనిచేస్తుంది.ట్రంప్ ప్రచార కార్యాలయంలో( Trump Campaign Office ) జరిగిన చోరీకి సంబంధించి లౌడౌన్ కౌంటీ షెరీఫ్ మైక్ చాప్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అనుమానితుడిని గుర్తించడానికి, ఏం జరిగిందో పరిశోధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
అలాగే షెరీఫ్ కార్యాలయం అనుమానితుడి ఫోటోలను కూడా షేర్ చేసింది.ఇతను ఎక్కడైనా కనిపిస్తే సమాచారం అందించాల్సిందిగా షెరీఫ్ కార్యాలయం ప్రజలను కోరింది.సీసీ కెమెరా ఫుటేజ్‌లో ముదురు రంగు దుస్తులు, బేస్‌బాల్ క్యాప్ ధరించిన వ్యక్తి, అతని ఛాతీపై బ్యాక్ ప్యాక్ కనిపించింది.
అయితే అగంతకుడు ఆఫీస్ నుంచి ఏదైనా దొంగిలించాడా లేదా అనేది ఇంకా ధృవీకరించాల్సి ఉంది.ఈ ఘటన 1972 అధ్యక్ష ఎన్నికల నాటి వాటర్‌గేట్ కుంభకోణంతో సమానంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
ఇకపోతే.డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
రీసెంట్గా ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా.దానిని ఏకంగా 200 మిలియన్ల మందికి పైగా వీక్షించినట్లు మస్క్ తెలిపారు.
ట్రంప్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ట్విట్టర్‌పై సైబర్ దాడి జరిగినట్లుగా ఎలాన్ మస్క్ వెల్లడించారు.