యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం కక్కిరేణి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రామ వాస్తవ్యులు నడిగోటి సతీష్ కుమార్ తండ్రి చిన్న నరసింహ కార్పెట్లను,బహుముఖ కార్యక్రమాలకు కొరకు పాపని జయప్రకాష్ రూ.3000/-,పేద విద్యార్థిని చెన్నని ఇందుశ్రీకి పిట్ట రవీందర్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి రూ.2000/ విరాళం అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్ తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పాఠశాల అభివృద్ధి కొరకు యువకులతో పాటు గ్రామంలోని పెద్దలు అనేక రకాలుగా సహకరించడానికి ముందుకు రావడం అభినందనీయమని, ఇలాగే అనేక కార్యక్రమాలు చేయుటకు దాతలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఏపీసి చైర్మన్ చిల్ల ప్రేమలత,మురళీకృష్ణ, గ్రామ పెద్దలు పిట్ట రాంరెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు గణేష్, గోపాల్ రెడ్డి,కృష్ణ,స్వర్ణలత వేముల సైదులు,గణేష్ తదితరులు పాల్గొన్నారు.