రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు.
బిడ్డ జన్మించిన ఆరు నెలల వరకు తల్లి ముర్రిపాలు తాగించాలని ఆమె కోరారు.
బిడ్డకు ఆరు నెలలు వచ్చిన తదుపరి తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్ఎల్ హెచ్ పి నవీన్, ఏఎన్ఎం సుమాంజలి, ఆశ వర్కర్ కవిత, మంజుల, అంగన్వాడి ఉపాధ్యాయురాలు వెల్దుర్తి రమాదేవి, ముత్యాల మౌనిక, బాలింతలు తల్లులు విద్యార్థిని, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థి అభినయకి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.