బస్సులో అపరిచితుడు భుజంపై తలవాల్చిన యువతి.. నెక్స్ట్ ఏం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో డైలీ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇలాంటిదే ఒక వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

 Young Lady Putting Heading On Stranger See What Happened Next Video Viral Detail-TeluguStop.com

ఈ వీడియోలో, కొంచెం అలసిపోయినట్లు కనిపించే ఒక అమ్మాయి బస్సు( Bus ) ఎక్కుతుంది.బస్సులో కిటికీ పక్కన సీటులో కూర్చున్న ఒక అబ్బాయి పక్కన కూర్చుని, ఆ అబ్బాయి భుజం మీద తల వాల్చి నిద్రపోతుంది.

ఆ బస్సు చాలా ఖాళీగా ఉంటుంది.ఎన్నో సీట్లు ఫ్రీగా ఉన్నాయి యువతి మాత్రం ఆ యువకుడి పక్కనకి వెళ్లే కూర్చుంటుంది.

తర్వాత అతడు తనకు ప్రియుడు అన్నట్లుగా అతని భుజం పైన( Shoulder ) పెట్టుకొని హాయిగా పడుకుంటుంది.కొన్ని సెకన్ల తర్వాత ఆ అబ్బాయి( Man ) ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూస్తాడు.

అప్పుడు ఆ అమ్మాయి( Lady ) నవ్వుతుంది.ఆ అబ్బాయి కూడా చాలా సిగ్గు పడుతూ చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వుతాడు.

ఆ అమ్మాయితో మాట్లాడి, తన భుజం మీద తల పెట్టుకొని పడుకోవచ్చు అని అంటాడు.ఈ వీడియోలో ఆ అమ్మాయి వైట్ స్లీవ్‌లెస్ టాప్, బేజ్ కలర్ ట్రౌజర్, వైట్ స్నీకర్స్ వేసుకుని ఉంది.

తన జుట్టును పైకి కట్టి, కళ్లద్దాలు పెట్టుకుని, ఒక బ్యాగ్‌తో కనిపించింది.

అంతేకాకుండా, ఆ అమ్మాయి చేతిలో ఒక కెమెరా కూడా ఉంది.బస్సులో ముందు నిలబడి ఉన్న మరొక వ్యక్తి ఆమె వీడియో తీస్తున్నాడు.ఇది ఒక సోషల్ ఎక్స్‌పరిమెంట్‌లా( Social Experiment ) ఉంది.

తనకు తెలియని ఆ అమ్మాయి తన భుజం మీద తల పెట్టి నిద్రపోవడం లేదు ఎలాంటి హాని లేదని సదరు యువకుడికి అనిపించింది.ఈ వీడియోను ఫాగుయింబా డబో అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఆయన ఈ వీడియోకి “మనిషి అంటే మనిషే” అని క్యాప్షన్ రాశాడు.ఈ వీడియో ఒకసారి చూడండి.

ఈ వీడియో జర్మనీ దేశం( Germany ) నుంచి వచ్చింది.ఇప్పటికే 49 లక్షల మందికి పైగా ఈ వీడియో చూశారు.లక్షలాది మంది లైక్ చేసి షేర్ చేశారు.చాలామంది ఈ వీడియో కింద కామెంట్లు చేశారు.“ఇది చాలా బాగుంది.కానీ ఒక అబ్బాయి తన తలను ఒక అమ్మాయి భుజం మీద పెట్టుకుంటే? పెద్ద గొడవైపోతుంది.” అని కొంతమంది ఈ వీడియో కింద కామెంట్ చేశారు.మిగతావాళ్లు జీవితంలో ఇలాంటి చిలిపి పనులు చేస్తే వచ్చే ఆనందమే వేరు అని పేర్కొన్నారు.

ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే తప్పు అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube