రాజన్న సిరిసిల్ల జిల్లా :సద్దుల బతుకమ్మ సందర్భంగా అభిమానంతో ఓ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ముఖచిత్రాన్ని బతుకమ్మ మీద రంగులు అద్ది అభిమానాన్ని చాటుకున్నాడు.
రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగూరి శ్రీనివాస్ రెడ్డి( Goguri Srinivas Reddy ) దంపతులు గత సంవత్సరం బతుకమ్మను పేర్చి చేతి గుర్తును వచ్చేలా తీర్చిదిద్ది అబ్బురపరిచాడు.
అదేవిధంగా గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రాన్ని బతుకమ్మపై వచ్చేలా రంగులు అద్దించి తమ మమకారాన్ని చాటుకున్నారు.బతుకమ్మపై సీఎం ముఖచిత్రం ఉండడంతో గ్రామస్తులు వచ్చి బతుకమ్మను చూస్తున్నారు.