రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయిస్తానని సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) తెలిపారు.వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీ హెచ్ సీ)ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఓపీ, సిబ్బంది హాజరు, రక్త పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించారు.
అనంతరం ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డ్, మందులు అందించే గది, ల్యాబ్, ఆసుపత్రి ఆవరణను చూశారు.
రోజు ఓపీ ఎంత వస్తుంది? డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర కేసుల పై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
దవాఖాన వైద్యులు, సిబ్బంది ప్రతి రోజూ సమయ పాలన పాటించాలని సూచించారు.అందుబాటులో ఉండి.
రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు.సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు.
జిల్లా కలెక్టర్ వెంట వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.