అంతర్జాతీయ బాలిక దినోత్సవం..

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీ ఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy), మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచనలతో సందీప్ కుమార్ ఝా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలతో అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది .మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ( United Nations )గుర్తించింది.2012, అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడింది.ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు (విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం)పై, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.

 International Day Of The Girl Child, Cm Revanth Reddy ,united Nations , Telang-TeluguStop.com

బాలికలు, యువతులు వారివారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతాయి.అంతర్జాతీయంగా చూసినప్పుడు ప్రతి 18 సంవత్సరాలలోపు ఉన్న నలుగురు బాలికలలో ఒకరికి బాల్య వివాహం జరుగుతుంది అని నివేదికలు తెలియజేస్తున్నాయని అలాగే బాలికలకు సరైన విద్య అందించకపోవడం సరైన పోషకాహారం అందించకపోవడం అసమానతలు చిన్నచూపు చూడడం వివక్ష కొనసాగుతూ ఉన్నాయన్నారు.

జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మహిళల అభ్యున్నతి కోసం బాలికల అభ్యున్నతి కోసం అనేక ప్రత్యేక పథకాలు చేపట్టడం జరిగింది.

దానిలో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల పిల్లల కోసం అన్ని వర్గాల పిల్లల కోసం ప్రత్యేక హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

కస్తూర్బా గాంధీ మహిళా విద్యాలయాలు, బాలికా విద్యాలయాలు, బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలు బాలికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదన్నారు.విద్య అందించడం ద్వారా వారి మనం బాలికల మహిళల ఆర్థిక సాధికారికతను సాధించవచ్చు.

వారందరికి ప్రయాణం కల్పించి ముందుకు తీసుకెళ్లడానికి బాలిక దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుంది అని జిల్లా మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ బోనాల రోజా తెలిపారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి ఈ లక్ష్మీరాజం, మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ వారి ఆదేశాలతో నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మలాదేవి,పోస్ట్మాస్టర్, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, హబ్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube