కార్యకర్తలను బి,ఆర్‌ఎస్ పార్టీ కంటకీ రెప్పలా కాపాడు కుంటుంది.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్.రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్‌ఎస్ పార్టీ( BRS party ) కార్యకర్తలకు ఎల్లవేళల అండగా ఉంటుందని కంటికి రెప్పలా కాపాడు కుంటుందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త మీసం లక్ష్మన్ కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మృతుని కూతురు కు 2 లక్షలు అదేవిధంగా అంబేద్కర్ నగర్ కు చెందిన దేవవ్వ గోడ కూలి ప్రమాదవశాత్తు మరణించగా ఆమే భర్త నర్సయ్య కు 2లక్షల ప్రమాద భీమా చెక్కులను ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక( MPP Pilli Renuka ) కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సీనియర్ నాయకులు అందె సుభాష్, ఎంపిటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి పర్షరాములు గౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు కలిసి గురు వారం అందజేశారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అందె సుభాష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ, నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

 Br And Rs Party Will Protect The Activists Like An Eye, Brs Party , Rajanna Sir-TeluguStop.com

ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కి లేని విధంగా తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో 60 లక్షలకు పైగా మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఎంతో ఉన్నతంగా ఆలోచించి ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఎల్ ఐ సి ఇన్స్యూరెన్స్ భీమా చేయించిందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కు వెన్నుదన్నుగా నిలుస్తుందని అదే విధంగా ప్రతి కార్యకర్త కూడా బిఆర్ఎస్ పార్టీ కి మద్దతుగా నిలిచి గెలుపే ద్యేయంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ నాయకులందరూ అండదండగా ఉంటారన్నారు.బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ను గుండెళ్ళో పెట్టుకొని చూసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం బిఆర్ ఎస్ పార్టీ ఇన్స్యూరెన్స్ భీమా అమలుచేస్తుందని అన్నారు, ఆ కుటుంబానికి వ్యక్తి ని భౌతికంగా తేలేకపోయిన ఆర్థీక సహాయం అందించి ఆదుకుంటాం అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube