జిల్లాలో మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలో మార్చ్ 03 వ తేదీన 5కె రన్ నిర్వహించడం జరుగుతుందని ఈ 5కె రన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువతి, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు పాల్గొని 5కె రన్ ను విజయవంతం చేయాలని డిఎస్పీ కోరారు.శనివారం రోజున సిరిసిల్ల డిఎస్పీ కార్యాలయంలో యాంటీ డ్రగ్స్ అవగాహన 5కె రన్ పోస్ట్ ను పోలీస్ అధికారులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించిన డిఎస్పీ.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ యువత మంచి భవిష్యతుకై గంజాయి, మతుపదార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ” మార్చ్ 03 ” వ తేదీన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించే మతుపదార్థాల అవగాహన 5కె రన్ లో జిల్లా ప్రజలు, యువతి,యువకులు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని,5కె రన్ లో పాల్గొన మొదట 13 మందికి సైకిల్ బహమతిగా ఇవ్వడం జరుగుతున్నరు.5కె రన్ లో పాల్గొనే వారు తప్పకుండా https://forms.gle/d7RmMcdcsN94eHfu6 లింక్ లో తమ తమ పూర్తి వివరాలతో పెరు నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలో మాధకద్రవ్యాలు, గంజాయ నిర్ములనకు పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై గంజాయ రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలన్నారు.5కె రన్ అనంతరం ఎల్ ఈ డి స్ర్కీన్ పై మాధకద్రవ్యాల వలన కలుగు అనార్ధాలు,మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి యెక్క మానసిక స్థితి,మానవ జీవితం పై చూపే ప్రభావం, మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి యెక్క నాడి వ్యవస్థ పని తీరు పై అవగాహన ఉంటూదని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్, రూరల్ సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, ఎస్.ఐ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.