రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District ) టీ యుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ఆదివారం సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు (MLA Ramesh Babu )ను మర్యాదగాపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కు ఎమ్మెల్యే రమేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వేములవాడ( Vemulawada ), కొనరావుపేట, రుద్రంగి మండలాలకు చెందిన జర్నలిస్టు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా అతి త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయింపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.