దళిత బందు మాకు ఎందుకు ఇవ్వరు. మేము అర్హులం కాదా మంత్రి కేటీఆర్ చెప్పండి

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు( Dalit Bandhu ) ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ లో నివాసముంటున్న వారికి దళిత బందు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.దళితులను దళిత బందు పేరిట ఓట్లు దండుకొవాలని దళిత బందు ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.

 Why Not Give Us Dalit Bandhu. Minister Ktr Tell Us Whether We Deserve It , Minis-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట దళితులు మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేయనిదే మీరు ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి చేపట్టార అని మంత్రి కెటిఆర్ ను వారు ప్రశ్నించారు.ఇదే ఎల్లారెడ్డిపేట మండలం లోనీ పదిర గ్రామం ను పైలట్ ప్రాజెక్టుగా దళిత బందు కింద ఎంపిక చేసి వారికి మాత్రమే దళిత బందు ఇచ్చారు.

వారు మాత్రమే మీరు ప్రవేశపెట్టిన దళిత బందు కు అర్హులా? మేము కాదా అని మంత్రి కెటిఆర్ ను ప్రశ్నించారు.జిల్లా అధ్యక్షుడు గా ఉన్న అతడి గ్రామంలోనే దళిత బందు కు దిక్కు లేదు అని మండిపడ్డారు.

పదిర గ్రామాన్ని ఎందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు ఎంచుకున్నరో సమాధానం చెప్పాలనీ ప్రశ్నించారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు,వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్ అందే వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు,మస్కురి దేవయ్య,ఏర్పుల తిరుపతి బక్కి ఎల్లయ్య తో పాటు 20 మంది పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube