బిజెపి నాయకులను అరెస్టు చేయంది పర్యటనకు రాని మంత్రి బిజెపి ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యక్షులు కృష్ణ హరి.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సోమవారం ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మండల భాజపా ఉపాధ్యక్షుడు కృష్ణ హరి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ సోమవారం పలు కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రానున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ఆప్రజాస్వామిక చర్యగా ఆయన అన్నారు.ఎప్పుడు వచ్చినా భాజపా కార్యకర్తల్ని నాయకుల్ని అరెస్ట్ చేస్తూ పిరికిపంద వలె ఈరోజు రోడ్లపై తిరుగుతున్నాడని రానున్న రోజుల్లో ప్రజలే తిరగబడే రోజు వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో మండల యువమోర్చా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్, సనత్ రెడ్డి,సాయి, ఏబీవీపీ రంజిత్తదితరులు ఉన్నారు.







