వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు...

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామ తీర్థపు మాధవి రాజు,కమిషనర్ అన్వేష్ , కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు పోరాటయోధుడు, సంఘ సంస్కర్త గొప్ప రాజకీయవేత్త అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కుల రహిత సమాజం కోసం పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధానిగా వారు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని,

 Babu Jagjeevan Ram Jayanthi Celebrations At Vemulawada Municipal Corporation Det-TeluguStop.com
Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

భారతదేశ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర సమరయోధులను పోరాటయోధులను వారు దేశానికి సేవలను స్మరించుకుంటూ వారి జయంతి, వర్ధంతి ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమని వారన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్ , కౌన్సిలర్లు మారం కుమార్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, నీలం కళ్యాణి శేఖర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube