వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…
TeluguStop.com
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామ తీర్థపు మాధవి రాజు,కమిషనర్ అన్వేష్ , కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు పోరాటయోధుడు, సంఘ సంస్కర్త గొప్ప రాజకీయవేత్త అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కుల రహిత సమాజం కోసం పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధానిగా వారు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, """/" /
భారతదేశ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర సమరయోధులను పోరాటయోధులను వారు దేశానికి సేవలను స్మరించుకుంటూ వారి జయంతి, వర్ధంతి ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమని వారన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్ , కౌన్సిలర్లు మారం కుమార్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, నీలం కళ్యాణి శేఖర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అక్కా చెల్లెళ్ల మధ్య గ్యాప్.. శిల్పా శిరోద్కర్ పోస్ట్ తో పూర్తి క్లారిటీ వచ్చేసిందిగా!