ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి - జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.

 Prajavani Applications Should Be Resolved Immediately District Additional Collec-TeluguStop.com

సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వచ్చిన 40 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.

అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజే యాలన్నారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ మధు సూదన్ , జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు రెవెన్యూ – 14,
సర్వే – 1,ఎస్ డి సి – 1,
ఎంపీడీఓ ఇల్లంతకుంట – 2,
ఎంసీ సిరిసిల్ల – 11,
డీపీవో – 2,డి ఎమ్ ఎచ్ ఓ – 1,ఎస్ ఆర్ ఆర్ డి
టెంపుల్ – 1,
ఏరియా హాస్పిటల్ – 3,
ఎంపీడీఓ ముస్తాబాద్ – 1,
సెస్ – 1,ప్రోహిబిషన్ – 1,
ఎంపీడీఓ గంభీరావుపేట – 1 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
TOTAL – 40.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube