మహాత్మా జ్యోతి భా పూలే డిగ్రీ కళాశాల మౌళిక వసతుల పై ఆరా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల మహాత్మా జ్యోతి బా పూలే డిగ్రీ కళాశాల లో గల మౌళిక వసతుల కల్పన పై స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరా తీశారు.ఈ మేరకు శుక్రవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీర ప్రభాకర్ తో చర్చించడం జరిగింది.

 Inquire About Basic Facilities Of Mahatma Jyoti Bha Poole Degree College , Mahat-TeluguStop.com

ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీర ప్రభాకర్ బాలరాజు యాదవ్ తో మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనంలో కళాశాల నిర్వహణ కొనసాగుతుందని నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి లేఖ రావడం జరిగిందనీ ఇట్టి కళాశాల నిర్మాణం కోసం ఆరు ఎకరాల విస్తీర్ణంలో డిగ్రీ కళాశాల నిర్మాణం చేయవలసి ఉంటుందనీ వీర ప్రభాకర్ అన్నారు.అదే విదంగా రాత్రి పూట విద్యార్థులు బయటకు వెళ్తే విద్యుత్ సౌకర్యం లేదని బల్బులు లేవని చెప్పగా గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్య తో,పంచాయతీ కార్యదర్శి దేవరాజు తో మాట్లాడి విద్యుత్ బల్బులు పెట్టే ఏర్పాటు చేస్తానని బాలరాజు యాదవ్ ప్రిన్సిపల్ వీర ప్రభాకర్ తో అన్నారు.

అదే విధంగా ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉన్న గుర్తించి డిగ్రీ కళాశాల సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానని బాలరాజు యాదవ్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube