రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్ ముస్కెం సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్( Dr.Goli Mohan )ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో సత్యనారాయణ గౌడ్ సర్పంచ్ గా పనిచేసినప్పటికీ ఆర్థికంగా ఎటువంటి వృద్ధి చెందకుండా పేద జీవితం గడుపుతున్నాడని ఆర్థికంగా చితికి పోవడంతో మనోవేదనకు గురై అనారోగ్యం పాలయ్యాడని తనకు భార్య, ఒకకూతురు ఉన్నారని తెలిపారు.డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ సత్యనారాయణ గౌడ్( Satyanarayana Goud) సర్పంచ్ గా పనిచేసినప్పటికీ ఆర్థికంగా లేకపోవడం, చిన్నతనంలోనే చనిపోవడం దురదృష్టకరమని అన్నారు.
సత్యనారాయణ గౌడ్ కూతురు చదువుకు తన వంతు సహకారం అందిస్తానని మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
చదువుతో ఎవరైనా కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆర్థికంగా అభివృద్ధి చెందితే మానసికంగా, శారీరకంగా ఎటువంటి ఒత్తిడి లేక అకాల మరణాలు సంభవించవని అన్నారు.నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తాను ఈసారి ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నూతన ప్రణాళికలతో నియోజకవర్గం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు.