విద్యార్థినీ లకు క్వాలిటీ ఏడ్యుకేషన్ అందించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బాలికల తెలంగాణ అల్ప సంఖ్యాకుల గురుకుల పాఠశాల ను, అనుబంధంగా ఏర్పాటు చేసిన హాస్టల్ నఆకస్మికంగా తనిఖీ చేశారు.బోధన జరుగుతున్న తీరు, యూనిఫాం లు ఇచ్చారా, భోజనం మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా అంటూ విద్యార్థిని లను జిల్లా కలెక్టర్ అడిగారు.

 Quality Education Should Be Provided To Female Students , Quality Education, Mis-TeluguStop.com

బోధన, వసతులు , భోజనం బాగున్నాయి అంటూ విద్యార్థినీ లు సమాధానం ఇచ్చారు.ప్లే గ్రౌండ్ లేదని విద్యార్థినీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

గురుకులం కు దగ్గర లో ఉన్న ప్రైవేట్ స్థలంలో సంబంధిత భూ యజమానులతో మాట్లాడి తాత్కాలికంగా ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపిడివో కు కలెక్టర్ సూచించారు.మిషన్ భగీరథ( Mission Bhagiratha ) త్రాగునీటీని గురుకులం, హాస్టల్ కు సరఫరా అయ్యేలా చూడాలని మిషన్ భగీరథ ఇంజనీర్లను కలెక్టర్ ఫోన్ లో ఆదేశించారు .అనంతరం జిల్లా కలెక్టర్ గురుకులం హాస్టల్ ను తనిఖీ చేశారు.మెనూ సిద్దం చేస్తున్న తీరు, కూరగాయలు, రైస్ స్టాక్ ను పరిశీలించారు.

హాస్టల్ తో పాటు వాష్ రూం లలో పరిశుభ్రతను పరిశీలించారు.విద్యార్థినీ దోమల బెడద లేకుండా మస్కిటో జాలిని ఏర్పాటు చేయాలన్నారు.

విద్యార్థినీ లకు క్వాలిటీ ఏడ్యుకేషన్, మెనూ ప్రకారం భోజనం అందించాలనీ ప్రిన్సిపల్, హాస్టల్ నిర్వాహకులను అదేశించారు.కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం ఓఎస్ డి సర్వర్ మియా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube