విద్యార్థినీ లకు క్వాలిటీ ఏడ్యుకేషన్ అందించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బాలికల తెలంగాణ అల్ప సంఖ్యాకుల గురుకుల పాఠశాల ను, అనుబంధంగా ఏర్పాటు చేసిన హాస్టల్ నఆకస్మికంగా తనిఖీ చేశారు.

బోధన జరుగుతున్న తీరు, యూనిఫాం లు ఇచ్చారా, భోజనం మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా అంటూ విద్యార్థిని లను జిల్లా కలెక్టర్ అడిగారు.

బోధన, వసతులు , భోజనం బాగున్నాయి అంటూ విద్యార్థినీ లు సమాధానం ఇచ్చారు.

ప్లే గ్రౌండ్ లేదని విద్యార్థినీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.గురుకులం కు దగ్గర లో ఉన్న ప్రైవేట్ స్థలంలో సంబంధిత భూ యజమానులతో మాట్లాడి తాత్కాలికంగా ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపిడివో కు కలెక్టర్ సూచించారు.

మిషన్ భగీరథ( Mission Bhagiratha ) త్రాగునీటీని గురుకులం, హాస్టల్ కు సరఫరా అయ్యేలా చూడాలని మిషన్ భగీరథ ఇంజనీర్లను కలెక్టర్ ఫోన్ లో ఆదేశించారు .

అనంతరం జిల్లా కలెక్టర్ గురుకులం హాస్టల్ ను తనిఖీ చేశారు.మెనూ సిద్దం చేస్తున్న తీరు, కూరగాయలు, రైస్ స్టాక్ ను పరిశీలించారు.

హాస్టల్ తో పాటు వాష్ రూం లలో పరిశుభ్రతను పరిశీలించారు.విద్యార్థినీ దోమల బెడద లేకుండా మస్కిటో జాలిని ఏర్పాటు చేయాలన్నారు.

విద్యార్థినీ లకు క్వాలిటీ ఏడ్యుకేషన్, మెనూ ప్రకారం భోజనం అందించాలనీ ప్రిన్సిపల్, హాస్టల్ నిర్వాహకులను అదేశించారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం ఓఎస్ డి సర్వర్ మియా తదితరులు పాల్గొన్నారు.

‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఎక్కడుందంటే?