నేరం చేస్తే శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: మూడు వివిధ కేసులల్లో తీర్పు వెల్లడించిన గౌరవ కోర్టు.నేరం చేస్తే శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.

 Only With The Punishment There Is A Change In The Society District Sp Akhil Maha-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

కేసుల వివరాలు.

చోరీ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు 100/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ వెల్లడించారు.

సిరిసిల్లలోని పెద్ద బోనాలకి చెందిన బైరగోని శ్రీనివాస్ కి బైపాస్ రోడ్డులో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.2023 డిసెంబర్ 11 న తన టిఫిన్ సెంటర్లో చోరీ జరిగిందని సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చోరీ చేసిన పెద్దపెల్లి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మడక చిరంజీవిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినారు.

కోర్టులో అప్పటి సీఐ బి ఉపేందర్ గారు చార్జిషీట్ దాఖలు చేసినారు ప్రాసిక్యూషన్ తరపున పి.పి.సందీప్ వాదించగా, సీఎంఎస్.ఎస్.ఐ రవీందర్ నాయుడు గారి ద్యారా కోర్టు కానిస్టేబుల్ నరేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 100/- రూపాయల జరిమానా విధించారు.

2.సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గంజాయి కేసులలో ఒక నిందుతుని 10 నెలల శిక్ష, మరో నిందుతులకు ఒక్కక్కరికి 2,000/- రూపాయల జరిమాన విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ బుధవారం తీర్పు వెల్లడించారు.

వేమువాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన జాన్ ప్రతాప్ రెడ్డి ,వడిచర్ల వనిత,బొమ్మల ఆంజనేయులు ( అనుపురం)పై రెండు గంజాయి కేసులలో సిరిసిల్ల పోలీసులు 2023 సంవత్సరంలో అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినారు .కోర్టులో అప్పటి సీఐ బి.ఉపేందర్ చార్జిషీట్ దాఖలు చేసారు.ప్రాసిక్యూషన్ తరపున పి.పి.సందీప్ వాదించగా, సిఎంఎస్ .ఎస్.ఐ.రవీందర్ నాయుడు ద్యారా కోర్టు కానిస్టేబుల్ నరేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు జాన్ ప్రతాప్ రెడ్డి కి 10 నెలల జైలు శిక్ష విధించారు.

వడిచెర్ల వనిత 2000/- రూపాయలు , బొమ్మల ఆంజనేయులుకు 2000/- రూపాయలు జరిమానా విధించారు అని ఒక ప్రకటన లో తెలిపారు .

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన వారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube