ఆకలి.మనం నిత్యం ఎదుర్కొనే ఒక అనుభవం.ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినకపోతే మనసు కుదురుండదు.అయితే కొందరికి సమయం సందర్భం తో పని లేకుండా ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది.ఏదో ఒకటి తిన్నా.మళ్లీ కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది.
దీన్నే అతి ఆకలి అంటారు.ఈ అతి ఆకలి కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, గుండె సమస్యలు ఇలా ఎన్నిటినో ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ముందు అతి ఆకలిని అణిచివేయాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు పానీయాలు అద్భుతంగా సహాయపడతాయి.ఈ డ్రింక్స్ ను డైట్ లో చేర్చుకుంటే అతి ఆకలి అన్న సమస్యే ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

జీరా వాటర్( Jeera Water ) లేదా జీలకర్ర నీరు.ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడం చాలా సులువు.ఒకటిన్నర గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మరిగిస్తే జీరా వాటర్ సిద్ధమవుతుంది.
అతి ఆకలిని అణిచివేయడానికి జీరా వాటర్ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మార్నింగ్ సమయంలో జీరా వాటర్ ను కనుక తీసుకుంటే తరచూ ఆకలి భావన కలగదు.
దాంతో తినడం తగ్గిస్తారు.పైగా జీరా వాటర్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.
కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.మరియు మోకాళ్ళ నొప్పులను సైతం నివారిస్తుంది.
అలాగే అతి ఆకలితో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన మరో అద్భుతం పానీయం మజ్జిగ( Buttermilk ) రోజుకి ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగ తాగితే అతి ఆకలి దూరమవుతుంది.అదే సమయంలో శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.
మైండ్ కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది.ఇక అతి ఆకలిని అరికట్టడానికి తులసి టీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే తులసి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా తులసి మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా తులసి ఆకులతో టీ( Tulsi Tea ) తయారు చేసుకుని నిత్యం తీసుకుంటే అతి ఆకలి సమస్య పరార్ అవుతుంది.అదే సమయంలో మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
.






