భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య( Doddi Komaraiah ) అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణా రాఘవ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు.
సోమవారం కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై యోధుడు దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాట స్ఫూర్తికి దొడ్డి కొమురయ్య ప్రతీక అని పేర్కొన్నారు.తెలంగాణ కో సం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
ఆయన పోరాటం ప్రజలందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( CM KCR )గొల్ల, కుర్మల అభివృద్ధికీ పెద్ద పీట వేస్తున్నారనీ అన్నారు.
అందులో భాగంగా నే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.రైతుబంధు( Raithu bandhu ), రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి( Kalyana Lakshmi ) తదితర పథకాలు బలహీన వర్గాల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా బిసి అభివృద్ధి అధికారి మోహన్ రావు, జిల్లా రవాణా అధికారి కొండల్ రావు,జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం, బిసి నాయకులు, గొల్ల, కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు .