అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం( Assembly Elections )లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.గురువారం రోజున ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటికల్ సర్వలేన్స్ బృందాలకు, జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.
ఖీమ్య నాయక్ తో కలసి బృందాలకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాలు కీలక పాత్ర పోషించాలన్నారు.
సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేపట్టాలన్నారు.ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని, రికార్డులు నిర్వహించాలని, ప్రతి వాహనం యెక్క నెంబర్ రాయలన్నారు.వాహనాల తనిఖీ, జప్తు చేసినటువంటి నగదు,ఇతర సమాచారానికి సంబంధించిన రికార్డు సమాచారాన్ని, నిర్దిష్ట ఫార్మాట్ లలో సంబంధిత అధికారుల ద్వారా రోజువారీగా పంపించాలని, జప్తు చేసిన వాటికి రశీదు ఇవ్వాలని అన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలు( FST SST Teams ) యాభై వేల రూపాయల నగదు కంటే పెద్ద మొత్తంలో డబ్బు దొరికినప్పుడు జిల్లా కమిటీకి వెంటనే సమాచారం అందించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్( GPS Tracking ) చేయడం జరిగిందని అన్నారు.
పట్టుపడిన నగదుకు సరైన విధమైన ఆధారాలు సమర్పిస్తే రెండు రోజుల్లో జిల్లా లెవల్ కమిటీ ఆధ్వర్యంలో రిలీస్ చేయడం జరుగుతుందని.,రాత్రి సమయాలల్లో పలు జాగ్రత్తలతో తనిఖీలు నిర్వహించాల్సిందిగా బృంద సభ్యులకు సూచించారు.
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, డబ్బు, మద్యం, రవాణాను అరికట్టాలని బృంద సభ్యులకు సూచించారు.
ఈ సమావేశంలో డిఎస్పీ నాగేంద్రచరి,సి.
ఐ లు ఎస్.ఐ లు ఎస్ ఎస్ టి ,ఎఫ్ ఎస్ టి బృందాలు పాల్గొన్నాయి.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) పేర్కొన్నారు.గురువారం రోజున ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటికల్ సర్వలేన్స్ బృందాలకు, జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్య నాయక్ తో కలసి బృందాలకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాలు కీలక పాత్ర పోషించాలన్నారు.
సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేపట్టాలన్నారు.ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని, రికార్డులు నిర్వహించాలని, ప్రతి వాహనం యెక్క నెంబర్ రాయలన్నారు.వాహనాల తనిఖీ, జప్తు చేసినటువంటి నగదు,ఇతర సమాచారానికి సంబంధించిన రికార్డు సమాచారాన్ని, నిర్దిష్ట ఫార్మాట్ లలో సంబంధిత అధికారుల ద్వారా రోజువారీగా పంపించాలని, జప్తు చేసిన వాటికి రశీదు ఇవ్వాలని అన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలు యాభై వేల రూపాయల నగదు కంటే పెద్ద మొత్తంలో డబ్బు దొరికినప్పుడు జిల్లా కమిటీకి వెంటనే సమాచారం అందించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ చేయడం జరిగిందని అన్నారు.
పట్టుపడిన నగదుకు సరైన విధమైన ఆధారాలు సమర్పిస్తే రెండు రోజుల్లో జిల్లా లెవల్ కమిటీ ఆధ్వర్యంలో రిలీస్ చేయడం జరుగుతుందని.,రాత్రి సమయాలల్లో పలు జాగ్రత్తలతో తనిఖీలు నిర్వహించాల్సిందిగా బృంద సభ్యులకు సూచించారు.
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, డబ్బు, మద్యం, రవాణాను అరికట్టాలని బృంద సభ్యులకు సూచించారు.ఈ సమావేశంలో డిఎస్పీ నాగేంద్రచరి,సి.ఐ లు ఎస్.ఐ లు ఎస్ ఎస్ టి ,ఎఫ్ ఎస్ టి బృందాలు పాల్గొన్నాయి.