రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యములో నిర్వహించినటువంటి ఉమ్మడి కరీంనగర్( Karimnagar ) జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్( Cricket Tournament ) జరగగా తుది పోరులో తడగొండ ,మర్రిపల్లి తలపడగా ఉత్కంఠ భరతంగా సాగిన మ్యాచ్ లో తడగొండ విన్నర్ గా మర్రిపల్లి రన్నర్ గా గెలుపొందారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మేడిపల్లి సత్యం హాజరై బహుమతులు అందజేశారు.
ఇట్టి సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ యువకులు క్రీడలతో పాటు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ,ఉపసర్పంచ్ చేపూరి వరలక్ష్మి కనకయ్య , వేములవాడ రూరల్ ఎంపీపీ , మర్రిపల్లి సర్పంచ్ , తడగొండ గ్రామ వార్డు సభ్యులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు క్రీడాకారులు ప్రజలు పాల్గొన్నారు.







