గాలివాన విధ్వంసం.. షెడ్డు కూలి ఒకరికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కోనరావుపేట మండలం లోని వైన్స్ ముందుగల రేకుల షెడ్డు కూలి ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.కొండాపూర్ గ్రామంలో భారీ గాలి కి నేల కూలిన విద్యుత్ స్తంభాలు.

 Destruction By Wind.. Shed Worker Seriously Injured , Rajanna Sirisilla Distric-TeluguStop.com

రోహిణి కార్తిలో రోళ్ల్లు పగిలే ఎండలు కొడతాయని అందరికీ తెలుసు కానీ నేడు రోహిణి కార్తె ప్రారంభంలో గాలివాన బీభత్సానికి మనుషుల తలలు పగిలాయి.కోనరావుపేట మండలం తో పాటు చందుర్తి మండలంలో సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది.

ఒక్కసారిగా ఊహించిన విధంగా గాలి దుమారం సృష్టించడంతో కోనరావుపేట మండల కేంద్రంలోని వైన్స్ ముందు రేకుల షెడ్డు కూలి పాలకొండ చంద్రయ్య అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.పలు గ్రామాల్లో గాలివాన విధ్వంసానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకులడంతో స్థానిక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పలుచోట్ల గాలివాన దుమారంతో విద్యుత్ సరఫర ను నిలిపివేసి అధికారులు సమీక్షిస్తున్నారు.ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube