గాలివాన విధ్వంసం.. షెడ్డు కూలి ఒకరికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కోనరావుపేట మండలం లోని వైన్స్ ముందుగల రేకుల షెడ్డు కూలి ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కొండాపూర్ గ్రామంలో భారీ గాలి కి నేల కూలిన విద్యుత్ స్తంభాలు.రోహిణి కార్తిలో రోళ్ల్లు పగిలే ఎండలు కొడతాయని అందరికీ తెలుసు కానీ నేడు రోహిణి కార్తె ప్రారంభంలో గాలివాన బీభత్సానికి మనుషుల తలలు పగిలాయి.

కోనరావుపేట మండలం తో పాటు చందుర్తి మండలంలో సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది.

ఒక్కసారిగా ఊహించిన విధంగా గాలి దుమారం సృష్టించడంతో కోనరావుపేట మండల కేంద్రంలోని వైన్స్ ముందు రేకుల షెడ్డు కూలి పాలకొండ చంద్రయ్య అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

పలు గ్రామాల్లో గాలివాన విధ్వంసానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకులడంతో స్థానిక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పలుచోట్ల గాలివాన దుమారంతో విద్యుత్ సరఫర ను నిలిపివేసి అధికారులు సమీక్షిస్తున్నారు.ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

ఫ్యామిలీతో వెకేషన్ లో చిల్ అవుతున్న బన్నీ… ఫోటోలు వైరల్!