ఇళ్లలోకి వరద నీళ్లు... ఎస్సీ కాలనీవాసుల ఇక్కట్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మూలవాగు పక్కన ఉన్న ఎస్సీ కాలనీలోని 150 ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.దీంతో కాలనీవాసులంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు.

 Flood Water In The Houses Sc Colonists Are In Trouble, Flood Water , Houses, Sc-TeluguStop.com

తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని మండల అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క అధికారి సంఘటన స్థలానికి చేరుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాగే మరో రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని,

తమను ఎలాగైనా సురక్షితమైన ప్రాంతాలకు తరలించి మమ్మల్ని రక్షించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.

ఎన్నికల సమయంలో మూలవాగు పక్కకు గోడ నిర్మిస్తామని హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని తమకు కష్టాలు వచ్చిన సమయంలో అధికారులు కానీ పాలకులు గానీ పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో పాటు విష పురుగులు, పాములు,తేల్లు వస్తున్నాయని చిన్నపిల్లలకు ప్రాణహాని ఉందని వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎస్సీ కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube