వెంటనే సర్వేను నిర్వహించి క్షేత్ర స్థాయిలో పంట నష్ట తీవ్రతను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు అధైర్య పడవద్దని….
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.జిల్లాలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను కోనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రైతులకు భరోసా ఇచ్చారు.
జిల్లాలో అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టం పై బుధవారం వ్యవసాయ , పౌర సరఫరాలు, ఉద్యానవన శాఖలు, రెవెన్యూ శాఖ సంబంధిత అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.పంటకోతకు వచ్చిన సమయంలో జిల్లాలో భారీ వర్షాలు, వడగళ్లవానలతో పంటను నష్టపోయిన రైతులేవరు అదైర్యపడోద్దని, నష్టపోయిన రైతులకు పంటనష్టాన్ని ఇప్పించేందుకు నివేదికను సిద్దం చేయించి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పంటనష్టాన్ని గురించి వ్యవసాయ, ఉద్యాన వన అధికారులను అడిగితెలుసుకొని వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటనష్ట నివేదికను సిద్దం చేయించాలని ఆదేశించారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యము ను టార్ఫాలిన్ లతో కప్పి పెట్టాలన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీవోలు టి శ్రీనివాసరావు, పవన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, ఉద్యానవన అధికారి జ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, తహాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.