రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం( Vemulawada)లోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రవాణా శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ నాయకులున్నారు.