మునగాల రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవాలని పాదయాత్ర

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలో ఈ నెల 12 తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృత్యువాత పడగా,ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెంది,దాదాపు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో మృతి చెందిన,గాయపడిన ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మునగాల మండల కేంద్రం నుండి సూర్యాపేట కలెక్టరేట్ వరకు జన వేదిక యూత్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

 Padayatra To Support Munaga Road Accident Victims-TeluguStop.com

ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ మునగాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అలాగే సూర్యాపేట జిల్లా నుండి కోదాడ క్రాస్ రోడ్డు 65వ జాతీయ రహదారిపై జిఎంఆర్ సంస్థ సరైన నిర్మాణాలు చేయకుండా వదిలేయడంతో ఇదంతా డేంజర్ జోన్ గా మారి నిత్యం ప్రమాదాల బారినపడి వందల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.

అదే విధంగా మునగాల మండల కేంద్రంలో అసంపూర్తిగా వదిలేసిన సర్వీసు రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్చేశారు.ఈ పాదయాత్రలో స్టూడెంట్స్,యూత్,స్థానిక ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube