సూర్యాపేట జిల్లా: ప్రజలందరిలో దేశభక్తి పెంపొందేలా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 78వ, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణకు సిద్ధమైన సందర్భంగా పట్టణంలో ముందస్తుగా నిర్వహించిన భారీ ర్యాలీని బాయ్స్ హైస్కూల్ వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
ఐవిఓ సభ్యులు,పాఠశాల,కళాశాల ప్రజాప్రతినిధులతో కలిసి 200 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రధాన రహదారిపై బస్టాండ్ నుండి ఖమ్మం క్రాస్ రోడ్,రాజీవ్ చౌరస్తా,వాయల సింగారం రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి,త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని,మహనీయుల ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు,పట్టణ ప్రముఖులు,మహిళలు,యువత,విద్యార్దులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.