ఆ చిన్న తేడా వల్లే తమిళ హీరోల కంటే టాలీవుడ్ హీరోలు వెనుకబడ్డారా..?

టాలీవుడ్ హీరోలలో ప్రభాస్,( Prabhas ) అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి కొంతమంది హీరోలు మాత్రమే ఇతర ఇండియన్ ఇండస్ట్రీల్లో చాలా స్టార్డమ్‌ తెచ్చుకున్నారు.కోలీవుడ్‌లో మాత్రం చాలామంది హీరోలు తెలుగు, తమిళం, మలయాళం హిందీ పరిశ్రమలలో బాగా గుర్తింపు పొందారు.

 Why Tollywood Is Below The Kollywood Details, Kollywood, Tollywood, Telugu Heroe-TeluguStop.com

సూర్య, ధనుష్, రజనీకాంత్, కమల్ హాసన్ విక్రమ్‌, విజయ్ సేతుపతిలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడంలో మనోళ్లు వీరికంటే వెనుకబడ్డారని చెప్పొచ్చు.

వాళ్లు ఇతర వాళ్లకి కనెక్ట్ కావడానికి, మనవాళ్ళు కనెక్ట్ కాకపోవడానికి ఒకటే రీజన్.అదేంటంటే తమిళ హీరోలు రియలిస్టిక్ పాత్రలు అద్భుతంగా పోషించగలరు.

ధనుష్( Dhanush ) అసురన్‌ సినిమాలో శివ స్వామిగా, సూర్య( Surya ) గజినిలో గజినీగా, సెవెంత్ సెన్స్ సినిమాలో బోధిధర్మగా అద్భుతంగా నటించారు.ఇక రజనీకాంత్( Rajinikanth ) రోబోగా నటించి వావ్ అనిపించాడు.

కమల్‌ హాసన్( Kamal Haasan ) దశావతారం సినిమాతో ఇండియాని షేక్ చేశాడు.విక్రమ్ అపరిచితుడు మూవీతో ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మొదటి తరం తెలుగు సినిమా హీరోలు రియలిస్టిక్ రోల్స్ చేశారు కానీ ఆ తర్వాత తెలుగు వాళ్ళు కమర్షియల్ హీరోలగానే కొనసాగారు.మహేష్ బాబు, నాగార్జున లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి పాత్రలు చేయడానికి ప్రయత్నించారు కానీ వాటికి పెద్దగా గుర్తింపు రాలేదు.

Telugu Dhanush, Kamal Haasan, Kollywood, Mahesh Babu, Nagarjuna, Rajinikanth, Re

మన తెలుగు హీరోలు ఢీగ్లామర్‌ రోల్స్ చేయడానికి ముందుకు రారు.హీరో ఎలివేషన్లు, సెంటిమెంటు, కామెడీ లాంటివన్నీ ఉండాలని కోరుకుంటారు.కానీ సూర్య లాంటి వారు జై భీమ్, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలు చేస్తారు.స్టార్ హీరో అయినప్పటికీ దెయ్యాలకి భయపడే చంద్రముఖి లాంటి పాత్రలు చేయడానికి వెనకాడరు.

తమిళ ఇండస్ట్రీలో “బాలా”, వెట్రిమారన్ లాంటి దర్శకులు రూరల్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు తీస్తుంటారు.ఇవన్నీ కూడా మంచి హిట్స్ అవుతుంటాయి.

Telugu Dhanush, Kamal Haasan, Kollywood, Mahesh Babu, Nagarjuna, Rajinikanth, Re

వాళ్లు తమిళ సంస్కృతిని తమ సినిమాల ద్వారా తెలియజేస్తారు.అవి అందర్నీ ఆకట్టుకుంటాయి.ఆ తమిళ ప్రజల జీవనంపై ఒక అవగాహన కల్పిస్తాయి కానీ తెలుగు వారు మాత్రం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను చాలా తక్కువగా చూపిస్తారు.ఒకవేళ చూపించినా దాన్ని కమర్షియల్ కోణంలో తీసుకు వెళ్తూ హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తారు.

మేకప్ లేకుండా సినిమాలు తీయడానికి పెద్దగా ఒప్పుకోరు.

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అలా ఉన్నారేమో కానీ ఇప్పుడు మాత్రం మారిపోయారు.

గ్రాఫిక్స్, గ్లామర్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం లాంటి ఫార్ములా సినిమాలు తీస్తూ హిట్స్ సాధిస్తున్నారు.ఇవి హిట్స్ అయితే అవుతాయేమో కానీ మంచి రోజు పోషిస్తేనే హీరోలకి మిగతా అన్ని ఇండస్ట్రీలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube